అయ్యయ్యో.. మనకు కలలు ఇందుకే వస్తాయా..ఇప్పటి వరకు తెలియనేలేదు..
samatha
19 January 2025
కలలు రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే కొందరికి రాత్రి సమయంలో పడుకున్న తర్వాత కలలు వస్తే, మరికొందరు మధ్యాహ్నం కునుకు సమయంలో కూడా కలలు కంటూ ఉంటారు.
అయితే చాలా మందికి అసలు ఈ కలలు ఎందుకు వస్తున్నాయి. అనే విషయం తెలియదు. కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
ప్రతి వ్యక్తికి నిద్ర అనేది చాలా అవసరం. మనం టైమ్ ప్రకారం నిద్రపోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అయితే మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మన మెదడు చాలా చురుకుగా పని చేస్తుందంట.
వివిధ దశలలో మన మెదడు పని చేస్తోంది. అందులో ఒకటి కలల దశ. దీనిని స్వప్న శాస్త్రంలో రాపిడ్ ఐమూవ్ మెంట్ అని కూడా అంటారంట.
ఈ దశలో మనం నిద్రపోయినప్పుడు, మన మెదడులో ఉన్న జ్ఞాపకాల, భావోద్వేగాలు మళ్లీ పునరావృతం అవుతుంటాయంటున్నారు నిపుణులు.
మనం ఏదైనా సంతోషకరమైన సమయం గడిపితే అది మన మెదడులో మెదులుతూ ఉంటుంది, అలాగే బ్యాడ్ సిట్యూవేషన్ ఫేస్ చేసినా అది మన మదిలో ఉండిపోతుంది. ఇవే కలలరూపకంగా మనకు నిద్రలో కనిపిస్తాయంట.
మరో విధంగా, సైకలాజికల్ ప్రకారం.. మన కలల ద్వారా మన ఆలోచనలు, కోరికలు, అదే విధంగా మన భయాలు వ్యక్తం అవుతాయంట.
ఇలా మనం గడిపిన క్షణాలు, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే అది ఎప్పుడూ మన మెదడులో మెదలడం వలన వాటన్నింటినీ రాత్రి సమయంలో మెదడు పునరావృతం చేసుకునే ప్రక్రియలో మనకు కలల రూపంలో వస్తాయంట.