ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఉల్లిపాయలు మాత్రం తప్పకుండా ఉంటాయి. కూర, పప్పు, చారు ప్రతిదాంట్లో వేస్తాం మరి. ఉల్లి వేయడం వల్లే కూరలో చక్కగా గ్రేవీ వస్తుంది
TV9 Telugu
పచ్చి ఉల్లిపాయలతో పచ్చడిచేసి తాలింపు పెడితే ‘ఆహా ఏమి రుచీ’ అనేస్తారంతా. సర్వకాల సర్వావస్థల్లో దొరికే ఉల్లిపాయలో ఎన్ని సుగుణాలున్నాయో, ఎంత మేలు చేస్తుందో మాటల్లో చెప్పలేం..
అయితే ఉల్లితోపాటు ఉల్లికాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వింటర్ సీజన్‌లో ఉల్లి కాడలు మార్కెట్‌లో అధికంగా కనిపిస్తాయి. వీటిని కూరగాయలతోపాటు సలాడ్‌గా ఉపయోగిస్తారు
TV9 Telugu
వీటిల్లో విటమిన్ ఎ, సి, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, సల్ఫర్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. పోషకాహార నిపుణుల ప్రకారం ఇది జీవక్రియను కూడా పెంచుతుంది
TV9 Telugu
బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉల్లికాడల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి
TV9 Telugu
ఉల్లి కాడల్లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
విటమిన్ ఎతో పాటు, కెరోటినాయిడ్ అనే మూలకం కూడా ఉల్లికాడల్లో ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మంచిది. వీటిల్లో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి