నానబెట్టిన కిస్మిస్ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Jyothi Gadda

10 March 2025

ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. 

కాలేయం, మూత్రపిండాలను బాగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి మలినాలను కూడా తొలగిస్తుంది.. హిమోగ్లోబిన్‌ను పెంచే ఐరన్ ఉంటుంది.

నానబెట్టిన కిస్ మిస్ లల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

నానబెట్టిన కిస్ మిస్ లను తింటే మీ ఒంట్లో రక్తం పెరుగుతుంది.  ఎముకలను బలంగా ఉంచుతాయి. ఎముకల పగుళ్లను నివారిస్తుంది. వృద్ధులకు ఈ కిస్ మిస్ లు ఎంతో ప్రయోజనకరం.

అలాగే, చిన్నపిల్లలకు కూడా ఆహారంగా వీటిని ఇచ్చినట్టైతే వారి జీర్ణక్రియ బాగా పనిచేస్తుందట. దాంతో వారికి మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎండు ద్రాక్ష లల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్, ఖనిజ లవణాలు, ఐరన్, కాపర్ , మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

కిస్ మిస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతాయి. చిన్నపిల్లలకు తరచుగా వచ్చే జ్వరాన్ని చాలా తొందరగా తగ్గిస్తాయి. 

అధిక బరువు నుంచి తొందరగా బయటపడేందుకు ఎండు ద్రాక్షలు బాగా ఉపయోగపడతాయి. ఎండు ద్రాక్షలను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.