వయసును బట్టి నిద్ర సమయం మారుతుంది.. మీకు ఎంత నిద్ర అవసరమో చెక్ చేసుకోండి!

19 June 2026

Rajashekher

వయసును బట్టి నిద్ర.. ఏడాది లోపు చిన్నారులు: 12–16 గంటలు. 1–2 ఏళ్లు: 11–14 గంటలు. 3–5 ఏళ్లు: 10–13 గంటలు.  6–12 ఏళ్లు: 9–12 గంటలు. 13–18 ఏళ్లు: 8–10 గంటలు. పెద్దలు: కనీసం 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ.

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఆరోగ్యానికి హానికరం.   సరిపడా నిద్ర లేకపోవడం, అతిగా నిద్రపోవడం రెండూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. 

నిద్రలేమి వల్ల అనేక వ్యాధుల ప్రమాదం. కుంగుబాటు, ఆందోళన, ఊబకాయం, మధుమేహం, హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

అతిగా నిద్రపోవడం కూడా ప్రమాదమే. రోజూ 9 గంటలకు మించి నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కార్డియోమెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యల ముప్పు పెరగవచ్చు.

ప్రతిరోజూ ఒకే నిద్ర సమయాన్ని పాటించాలి.  వారాంతాలు, సెలవు రోజుల్లో కూడా ఒకే సమయానికి పడుకోవడం, లేవడం మంచిది.

పడకగదిలో ప్రశాంత వాతావరణం ఉండాలి. నిద్రకు ముందు 30–60 నిమిషాల పాటు మొబైల్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి.

కాఫీ, టీ వంటి కెఫీన్ పానీయాలను తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో కెఫీన్, అధిక చక్కెర ఉన్న ఆహారాలు తీసుకోవడం నిద్రకు భంగం కలిగిస్తుంది.

మధ్యాహ్నపు నిద్రను పరిమితం చేయాలి. పగటిపూట 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పాలు, బాదం, కివీ వంటి ఆహారాలు తీసుకోవడం, రాత్రి భోజనం నిద్రకు 3 గంటల ముందే చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మంచి నిద్ర లభిస్తుంది.