మీ డైట్‎లో నానబెట్టిన బాదం ఉంటే.. ఆ సమస్యల కథ కంచికే..

20 September 2025

Prudvi Battula 

బాదంపప్పులను నానబెట్టడం వల్ల విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాల జీవ లభ్యత పెరుగుతుంది. శరీరం వాటిని సులభంగా గ్రహించేలా చేస్తుంది.

నానబెట్టిన బాదంపప్పు ఎంజైమ్ ఇన్హిబిటర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో జీర్ణం అవుతుంది. జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఉండదు.

నానబెట్టే ప్రక్రియ బాదంపప్పులోని కొన్ని పోషకాలను మరింత పెంచుతుంది. వాటిలో యాంటీఆక్సిడెంట్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నానబెట్టిన బాదంపప్పులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంద. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

నానబెట్టిన బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు.

వీటిలో విటమిన్ E, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యం మెరుగుపరిచి అభిజ్ఞా పనితీరుకు తోడ్పడతాయి.

ఇందులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ తినేలా చేస్తాయి. బరువు నిర్వహణకు సహాయపడతాయి.

నానబెట్టిన బాదం పప్పులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఇతర ఖనిజాలు బలమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం.