చాణక్య నీతి: సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుందా..మీకోసమే!
samatha
19 January 2025
చాలా మంది చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. కష్టతరమైన సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, సూసైడే బెటర్ అని ఆలోచిస్తారు.
అయితే అలాంటి వారికి ఆచార్య చాణక్యుడు కొన్ని సనూచనలు చేశారు. ఆయన తన నీతిశాస్త్రంలో మానవవాళికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చే వారికి కొన్ని సూచనలు చేశారు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం?
పోయిన డబ్బును మళ్లీ తిరిగి సంపాదించవచ్చు. బంధుత్వాలు దూరమైనా, మళ్లీ దగ్గరవుతాయి. కానీ ప్రాణం పోతే మళ్లీ రాదు.
ఒక్కసారి ఈ శరీరాన్ని మీరు వదిలేస్తే అది మీరు ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పటికీ తిరిగి రాలేదు. శరీరం అంత గొప్పది.
మన శరీరంలో ఉన్నంత సేపే మనం మంచి పనులను చేయగలుగుతాం. అందుకే మన శరీరాన్ని మనమే రక్షించుకోవాలి. మన ప్రాణాన్ని కాపాడుకోవాలి.
అతి నిద్ర, అతి తిండి , ఆలోచన, బాధ, ఇవి శరీరానికి నష్టం, శాంతి, ప్రేమ, సత్యం, అహింస ఇవే మన శరీరానికి మంచిది
మనం తిని పారేసే అరటి ఆకులాంటిది మన శరీరం. కానీ తిని పారేసే ఆకు మనం పారేసే ముందు ఒకరి ఆకలి తీర్చానని సంతోషిస్తుందంట. మరీ మానవ శరీరం ఏం చేయాలి అంటూ చాణక్యుడు చాలా గొప్పగా చెప్పారు.