ఒక్కరోజు 4 ప్రాంతాలు.. వీకెండ్ టూర్ కోసం మంచి ప్యాకేజీ..
18 June 2025
Prudvi Battula
"హైదరాబాద్-కొండపోచమ్మ-వేములవాడ-కొండగట్టు-హైదరాబాద్" పేరుతో తెలంగాణ టూరిజం వీకెండ్ టూర్‌ని ప్లాన్ చేసింది.
ఏసీ మినీ బస్‌లో ఈ టూర్ ప్రతీ శనివారం అందుబాటులోకి తీసుకువచ్చింది. రద్దీ బట్టి ఆదివారం కూడా ప్లాన్ చేస్తారు.
ఉదయం 6 గంటలకు బషీర్‌బాగ్ సీఆర్‌ఓ కార్యాలయం నుంచి స్టార్ట్ అయినా బస్సు మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేసి 9 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకుంటారు.
రిజర్వాయర్ చూసి మళ్లీ 10 గంటలకు అక్కడి నుంచి మొదలై 11 గంటలకు కొమరవెళ్లి మల్లన్నను దర్శనం చేసుకుంటారు.
తర్వాత అక్కడి నుంచి వేములవాడకు బయలుదేరి 2 గంటలకు వేములవాడ చేరుకొని 4 గంటల వరకు దర్శనం, లంచ్ ఉంటుంది.
సాయంత్రం 4 గంటలకు వేములవాడలో అన్ని ముగించుకొని అక్కడి నుంచి బస్సులో బయలుదేరి 5 గంటలకు కొండగట్టు చేరుకొని 6 గంటల లోపు అంజన్న దర్శనం ముగించుకుంటారు.
అనంతరం కొండగట్టు నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్ రిటర్న్ బయలుదేరుతారు. రాత్రి 10 గంటలకు సిటీకి వచ్చి టూర్ ముగుస్తుంది.
తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజ్ కోసం ఒక్కరి టికెట్‌కి పెద్దలకు రూ.1200, పిల్లలకు రూ.960 వసూలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శాతవాహన రీజియన్ టూర్.. తెలంగాణ టూరిజం నయా ప్యాకేజీ..
ఐస్‌క్రీమ్‌తో అనేక ప్రయోజనాలు.. తెలిస్తే షాక్..
సండే టూర్ ఉందా.? ఈ శైవక్షేత్రం మంచి ఎంపిక..