వాస్తును ఫాలో అవుతే జీవితంలోని అనేక రకాల కష్టాలు తొలగిపోతాయని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో ఇంటికి ఏ రంగు వేసుకుంటే మంచిదో వివరించారు.
ఇంటి గోడల రంగు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. గోడల రంగు సరిగ్గా ఉంటే అదృష్టాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు
కాబట్టి ఇంటికి రంగులు వేసేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు
ఇంటికి పెయింటింగ్ చేసేటప్పుడు సరైన రంగులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గోడలు ఏ రంగులో ఉండాలో తెలుసుకోండి
పూజ గది గోడల రంగు ఎల్లప్పుడూ పసుపు, నీలం లేదా నారింజ రంగులో ఉండాలి. పూజా గదిలో ఈ రంగును ఉపయోగించడం వల్ల మనిషిలో పాజిటివిటీ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది
అలాగే పూజా గదిలో నల్ల రంగు లేదా ముదురు రంగు వస్తువులను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే నలుపు రంగు అశుభంగా భావిస్తూ ఉంటారు
వంటగదికి ఎరుపు, నారింజ, నీలం లేదా ఆకుపచ్చ రంగులు వేయాలి. వంటగదిలో ఈ రంగులను వేయడం వల్ల మహిళల మానసిక స్థితి ఎల్లప్పుడూ బాగుంటుందని నమ్ముతారు.
బాత్‌రూమ్‌లు, టాయిలెట్లలో తెలుపు రంగు వేయాలి. బెడ్ రూమ్ గోడలు ఎల్లప్పుడూ గులాబీ, లేత నీలం, నీలం లేదా ఆకుపచ్చ పెయింట్ వేస్తే దాంపత్య జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది