రాళ్లలోనూ ఆడ, మగ తేడా! నమ్మలేని నిజాలు

23-06-2026

Pic credit - Instagram

Phani Ch

మనుషుల్లోనే కాదు, మనం పూజించే దేవాలయాల విగ్రహాలను తయారుచేసే రాళ్లలో కూడా ఆడ, మగ తేడాలు ఉంటాయని మన శిల్ప శాస్త్రం చెబుతోంది.

దేవాలయాల గర్భాలయంలో ప్రతిష్టించే విగ్రహాల కోసం శిల్పులు రాళ్లను ఎంపిక చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన సాంకేతిక నియమాలను పాటిస్తారు.

రాతి స్వభావం, ఆకారం మరియు దాని నుంచి వచ్చే ధ్వని (నాదం) ఆధారంగా వాటిని పురుష శిల, స్త్రీ శిల, నపుంసక శిలలుగా విభజించారు.

రాయిని తట్టినప్పుడు కంచు గంట మోగినట్లుగా దీర్ఘమైన ఓంకార శబ్దం వస్తే.. దానిని 'పురుష శిల'గా గుర్తిస్తారు. ఇవి సాధారణంగా పెద్దవిగా ఉంటాయి.

అదే విధంగా రాయిని కొట్టినప్పుడు ఇత్తడి గంట చప్పుడులా కొంత తక్కువ ధ్వని వస్తే, దానిని 'స్త్రీ శిల'గా మన శిల్ప శాస్త్రంలో పిలుస్తారు.

ఒకవేళ రాయిని తట్టినప్పుడు డప్పు కొట్టినట్లుగా లేదా తప్పెట శబ్దం లాంటి చప్పుడు వస్తే, దానిని 'నపుంసక శిల'గా వర్గీకరిస్తారు.

నియమాల ప్రకారం పురుష శిలలతో కేవలం పురుష దేవతా మూర్తుల (ఉదాహరణకు వేంకటేశ్వరస్వామి, రాముడు) విగ్రహాలను మాత్రమే తయారు చేస్తారు.

స్త్రీ శిలలతో లక్ష్మీదేవి, సీతమ్మ వంటి అమ్మవార్ల విగ్రహాలను మలుస్తారు. ఇక నపుంసక శిలలను విగ్రహాల కింద పీఠాలు, ఫ్లోరింగ్ కోసం వాడతారు.