గుడ్డు VS చికెన్.. ఎందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో తెలుసా?

samatha 

13 march 2025

Credit: Instagram

చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఫుడ్‌లో చికెన్, ఎగ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎక్కువ మంది వీటినే తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఆరోగ్యం, ఫిటెనెస్‌ కోసం మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలని అందరూ అనుకుంటారు. ప్రోటీన్ ఉన్న ఆహారాల్లో చికెన్, ఎగ్ మొదటి స్థానంలో ఉంటాయి.

అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఎగ్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందా లేదా చికెన్‌లో ఎక్కువ ప్రొటీన్ ఉంటుందా అని ఆలోచిస్తారు. దాని గురించే తెలుసుకుందాం.

మంచి, అధిక ప్రోటిన్ కలిగిన వాటిలో గుడ్డు, చికెన్ రెండూ మొదటి స్థానంలో ఉంటాయంట. గుడ్డులో దాదాపు ఆరు నుంచి ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

చికెన్‌‌లో దాదాపు 26 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే గుడ్డను తినడం వలన ఇందులోని ప్రోటీన్‌ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంట.

గుడ్డు, చికెన్ రెండూ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్స్. ఎందుకంటే ఇవి మానవ శరీరం ఉత్పత్తి చేయలేని తొమ్మిది ముఖ్యమైన ఆమైనో ఆమ్లాలను కలిగిఉంటాయి. ఇది మానవ శరీరానికి చాలా ఉపయోగపడుతుంది.

ఎగ్‌లో విటమిన్ డీ, విటమిన్ బి12, ఐరన్ వంటివి ఉంటాయి, చికెన్‌లో విటమిన్ బి8,సెలీనియం ఉంటుంది. సంతృప్త కొవ్వులు అనేవి ఎగ్స్‌లోనే అధికంగా ఉంటాయి.

అలాగే ఎగ్‌లో చికెన్ కంటె ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది.చికెన్ ఎక్కువ కెలరీలు కలిగిఉంటుంది. అయితే కండారాలకు అధిక ప్రోటీన్, తక్కువ కొలెస్ట్రాల్ కావాలి అనుకున్నప్పుడు చికెన్ మంచి ఎంపిక, అధిక ప్రోటీన్ ఎక్కువ కొలెస్ట్రాలకు ఎగ్ మంచి ఎంపికనంట.