పొడిబారిన చేతులు.. కోమలంగా మారాలంటే.!

11 December 2024

TV9 Telugu

మనం రోజూ నీటితో చేసే పనుల కారణంగా చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోయి, నిర్జీవంగా మారిపోతాయి.. మరి దీనికి పరిష్కారం..?

ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో మీ చేతులను చక్కగా మునుపటిలా మృదువుగా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఆలివ్‌ ఆయిల్, చక్కెరలతో తయారుచేసిన స్క్రబ్ పొడిబారిన చేతులను మళ్లీ తిరిగి కోమలంగా మార్చడంలో సహకరిస్తుంది.

ఇందుకోసం అరకప్పు చక్కెరలో టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ నూనె వేసి బాగా కలిపాలి. అవసరమనుకుంటే వేరే ఏదైనా నూనెను కూడా అదనంగా కలుపుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని దాన్ని చేతులపై రాసుకొని రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి.

నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్‌ చేయాలి. ఈ ముక్కల్ని చక్కెర పొడిలో అద్దుతూ చేతులు, మణికట్టుపై ఇరవై నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోవాలి.

కలబంద గుజ్జు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చేతులకు రాసుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి.

పొడిబారిన చేతుల్ని కోమలంగా మార్చే సుగుణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ కొద్దిగా తేనె తీసుకొని చేతులకు రాసుకోవాలి.