ఆహారంలో ఈ మార్పుల చాలు.. గుండె సమస్యలు దూరం..

TV9 Telugu

13 January 2025

ప్రస్తుత ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల హృద్రోగ సమస్యల నుంచి గట్టెక్కవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.

స‌మతులాహారం, మొక్క‌ల ఆధారిత ఆహారం, పండ్లు, కూర‌గాయ‌లు, తృణ‌ధాన్యాలను మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి.

మితంగా ప్రాసెస్ చేసిన ఆహారాల‌తో కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అసంతృప్త కొవ్వులు, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భించే న‌ట్స్‌, సీడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.

నట్స్‌, సీడ్స్‌ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను త‌గ్గించి హృద్రోగ ముప్పును త‌గ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గోధుమ‌లు, ఓట్స్‌, బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటి తృణ‌ధాన్యాలతో కొలెస్ట్రాల్ త‌గ్గి ఆరోగ్య‌క‌ర‌మైన బ‌రువును మెయింటైన్ చేయ‌వ‌చ్చు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకునేందుకు చిక్కుళ్లు, పండ్లు, కూర‌గాయ‌లు సమతులంగా తీసుకుంటుండాలి.

బెర్రీస్‌, అవ‌కాడో, ఆలివ్ ఆయిల్, సోయా ఉత్ప‌త్తులను కూడా ఆహారంలో చేర్చుకుంటే గుండె పోటు ముప్పు తగ్గుతుంది.