వైరల్ ఫీవర్ లక్షణాలు ఇవే..!
TV9 Telugu
11 March 2025
వైరల్ జ్వరం వచ్చినప్పుడు, శరీర ఉష్ణోగ్రత 100 కంటే ఎక్కువగా పెరుగుతుంది. కొన్నిసార్లు శరీర ఉష్ణోగ్రత జ్వరం 103 డిగ్రీల వరకు కూడా పెరుగుతుంది.
వైరల్ జ్వరం వచ్చినప్పుడు చలి, చెమట పట్టడం అనేది సాధారణ ప్రక్రియ. చలి జ్వరం వస్తే చాలా సార్లు రోగికి రెండు నుండి మూడు దుప్పట్లు అవసరం అవుతాయి.
వైరల్ జ్వరం వచ్చినప్పుడు, శరీరంలో, ముఖ్యంగా కీళ్ళు, కండరాలలో నొప్పి మొదలవుతుంది. ఒకరు అలసిపోయినట్లు, మరికొందరు బలహీనంగా అనిపించడం ప్రారంభిస్తారు.
వైరల్ జ్వరంలో, తలనొప్పి మరింత తీవ్రమవుతుందని. చాలా కాలం పాటు ఉంటుంది. ఈ జ్వరం దాదాపు 5 రోజులు ఉంటుంది.
ముక్కు కారటం, ముక్కు మూసుకుపోవడం వైరల్ జ్వరం నిజమైన లక్షణాలు. ఇక గొంతు నొప్పి కూడా వైరల్ ఫీవర్‌కు సంకేతం.
జ్వరం ఎక్కువగా ఉండి రెండు రోజుల కన్నా ఎక్కువ ఉంటే, మీ చర్మంపై దద్దుర్లు కూడా కనిపించవచ్చు అంటున్నారు వైద్యులు.
శరీరంలోని ఏ భాగంలోనైనా ఎర్రటి మచ్చలు కనిపించాయంటే అది వైరల్ ఫీవర్‌కు సంకేతం. వైరల్ జ్వరంలో వాంతులు, విరేచనాలు సర్వసాధారణం.
వైరల్ జ్వరంలో రోగికి ఏమీ తినాలని అనిపించదు. పదే పదే వికారం కలుగుతూనే ఉంటుంది. వెంటనే డాక్టర్ని కలవడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నకిలీ పనీర్‌ను గుర్తించడిలా..
పిల్లలను కౌగిలించుకోకపోతే కలిగే 7 ప్రభావాలు..
ఈ ఆహారలతో మీ సుహూర్ సాఫీగా..