థైరాయిడ్ గ్రంథి గాయిటర్ అంటే ఏంటో తెలుసా?

Samatha

21 August  2025

Credit: Instagram

థైరాయిడ్ సమస్యల్లో గాయిటర్ ఒకటి. చాలా మంది థైరాయిడ్ బారినపడతారు. అందులో హైపర్ థైరాయిడ్ ఒకటి, హైపో థైరాయిడ్ ఒకటి,కొందరిలో గాయిటర్ సమస్య ఉంటది.

గాయిటర్ ఉన్నవారిలో గొంతు దగ్గర  గడ్డలా అనిపించడం, మెడభాగంలో వాపు శ్వాస తీసుకోవడానికి, మింగడానికి ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 థైరాయిడ్ గ్రంధి వాపుని గాయిటర్ అంట్టారు. సీతాకోక చిలుక ఆకారంలో మెడ ముందు భాగం లో ఉంట్టుంది, ఇది నొప్పి లేకుండా ఉంటది.

థైరాయిడ్ గ్రంధి లో మార్పుల కారణంగా బరువు తగ్గడం, పెరగడం, చర్మం పొడిబారడం, మలబద్దకం, అలసట వంటివి వస్తాయి. కాగా, గాయిటర్ లక్షణాల గురించి తెలుసుకుందాం.

 ఆహారం, నీరు మింగేటప్పుడు ఇబ్బంది  లేదా నొప్పి అనిపించడం.గొంతు దగ్గర వాపు లేదా గడ్డలా అనిపించడం, దగ్గు రావచ్చు.

 పెద్ద గాయిటర్ లు మింగేటప్పుడు ఇబ్బంది కలిగించవచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది  వలన గురక రావచ్చు.

థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని బట్టి బరువు తగ్గడం, పెరగడం జరుగుతుంది, తరుచు అలసట అనిపిస్తుంది.

గాయిటర్ లక్షణాలు సాధారణంగా నొప్పి లేకుండా ఉంట్టాయి, మింగడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటె డాక్టర్ ని సంప్రదించడం మంచిది.