ఉదయాన్నే,ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త !
samatha
20 January 2025
టీ అంటే ఇష్టపడని వారు ఉంటారా? చాలా మంది తమ రోజును టీతోనే మొదలు పెడుతుంటారు. ఇంకొంత మందికి అసలు టీ లేనిదే రోజు గడవదు.
టీ తాగడం వలన మనసుకు కాస్త హాయిగా అనిపించడమే కాకుండా తలనొప్పి లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా టీ తాగుతుంటారు.
అయితే ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ లేదా, కాఫీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ కు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా ఉదయాన్నే టీ తాగడం వలన అనేక జీర్ణ సమస్యలు వస్తాయంట.
ఉదయాన్నే టీ తాగడం వలన అసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయంట. అందువలన టీ తాగే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంట.
ముఖ్యంగా టీని, ఉదయం నిద్రలేచిన తర్వాత రెండు లేదా మూడు గంటల తర్వాత టీ తాగితే అది శరీరానికి ఎలాంటి హాని చేయదంట.
అలాగే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అల్సర్, వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.