హనుమాన్ పండు గురించి తెలుసా.? ఆరోగ్యానికి దైవ వరం లాంటింది.. 

TV9 Telugu

09 March 2025

హనుమాన్ పండు బ్రెజిల్ కి చెందినదిగా చెబుతారు. దక్షిణ భారతదేశంలో కొన్నిచోట్ల ఈ రామాఫలం చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ పండు చూడటానికి సీతాఫలం, రామా ఫలం పండ్ల కనిపిస్తున్నప్పటికీ దీని తొక్కపై ముళ్ళు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు, కాయలు, విత్తనాలు వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు.

అధ్యయనాల ప్రకారం హనుమాన్ పండ్లలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాల్, ట్రై గ్లిజరైడ్స్, ఫినోలెక్స్, సైక్లోపెటైట్స్ వంటి ముఖ్యమైన ఫైటో కెమికల్స్ 212 దాకా ఉంటాయి. 100 గ్రాముల పండులో 81 గ్రాములు నీరే ఉంటుంది.

ఇందులోని ఎసిటోజెనిన్స్, క్వినోలోన్స్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి రోగాల నుండి రక్షిస్తుంది.

ఈ పండును సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన కీమోథెరపీ అని కూడా చాలా చోట్ల పిలుస్తారు. ఈ చెట్టు ఆకులను తీసుకోవడం వల్ల 12 రకాల క్యాన్సర్లను తరిమి కొట్టవచ్చని ఎంతోమంది నమ్మకం.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువమంది మహిళలు ఎదుర్కొంటున్న ఆదారణ ఆరోగ్య సమస్యలలో ఇది ఒకటి ఈ సమస్య ఉన్నవారు హనుమాన్ ఫలం తింటే ఉపయోగం ఉంటుంది

చాలామంది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో శరీరంలో నీరు నిలిచిపోయి ఉబ్బినట్లు కనిపిస్తారు. హనుమాన్ ఫలం తినడం వల్ల ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.

జీర్ణ సమస్యలు ఉన్నావారు ఈ పండును తరచూ తినాలి. ప్రోటీన్, డైటరీ ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఫొలేట్ వంటి ఎన్నో పోషకాలున్నాయి.