కీరా దోసతో కోరినంత ఆరోగ్యం.. కానీ శీతాకాలంలో తినొచ్చా?
28 November 2024
TV9 Telugu
TV9 Telugu
మండే ఎండల్లో శరీరానికి చలువనిచ్చేది ఏదైనా ఉందంటే.. అది కీరదోసనే. కీర శరీరాన్ని చల్లగా ఉంచడం మాత్రమే కాదు శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
శరీరంలో కోల్పోయిన నీటితో పాటు శక్తిని తిరిగి పొందడానికి కీరా దోస బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి
TV9 Telugu
నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరా దోస కూడా ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ కూడా చేస్తుంది
TV9 Telugu
కీర దోసలో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని శీతాకాలంలో కూడా తినవచ్చా? లేదా? అని చాలా మంది సందేహిస్తుంటారు
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీరదోసలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది చలికాలంలో చర్మం పొడిబారకుండా చేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
అలాగే కీరదోసలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి
TV9 Telugu
కీరదోసలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది
TV9 Telugu
కీరదోసకాయలో ఉండే విటమిన్ కె, కాల్షియం ఎముకలను దృఢపరచడంలో సహాయపడతాయి. అయితే కీరదోస చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి జలుబు, గొంతు నొప్పి ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి