అతిగా ఉప్పు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

samatha 

02 february 2025

Credit: Instagram

చాలా మంది ఉప్పును అతిగా తింటుుంటారు. అయితే ఇలా అధికంగా ఉప్పును తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట.

కాగా, ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఉప్పును అధికంగా తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం ఏర్పడుతుందంట. అంతే కాకుండా దీని వలన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

సాల్ట్ ఎక్కువ తీససుకోవడంలో కిడ్నీలు డ్యామెజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉప్పుకు దూరంగా ఉండాలి

ఇక ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఉప్పును అధికంగా తీసుకోవడం వలన గుండె జబ్బులు వస్తాయంట

అధికంగా ఉప్పు తీసుకోవడం లో అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వలన ఎమకలు బలహీనపడి, బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

అందుకే ఉప్పును అధికంగా తీసుకోకుండా,  తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలా చేయడం వలన ఎలాంటి అనారోగ్యసమస్యలు దరి చేరవు