రోజు 5 నిమిషాలు ధ్యానం.. ఆ సమస్యలన్నీ దూరం..
09 December
2024
TV9 Telugu
ప్రతిరోజు కనీసం అరగంట సేపు మెడిటేషన్ చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్తుంటారు.
తాజా అధ్యయనం మాత్రం డీప్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ 5 నిమిషాలు చేసినా ఆ ఫలితం దక్కుతుందని వెల్లడించింది.
అదే సమయంలో కొత్త అంశాలను గ్రహించడానికి, సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి ఇది సహాయపడుతుందని స్పష్టం చేసింది.
మైండ్ ఫుల్‌నెస్ మెడిటేషన్ భావోద్వేగాలు, ఒత్తిడి నియంత్రణ వంటివి మేనేజ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఒక గ్రూపు వారిని 5 నిమిషాల మైండ్ ఫుల్‌నెస్ ధ్యానం చేయడాన్ని, మరొక గ్రూపును సాధారణ ధ్యానంలో నిమగ్నమయ్యేలా సూచించించారు.
కాగా మైండ్ ఫుల్‌నెస్ (బుద్ధిపూర్వక)శ్వాసపై దృష్టి సారించిన 5 నిమిషాల లోతైన ధ్యానం చేసేవారిలో కొంతకాలానికి కాగ్నెటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడం గమనించారు.
నేర్చుకునే సామర్థ్యం, పలు నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి పెరగడం గ్రహించారు. ఐదు నిమిషాల డీపెస్ట్ మెడిటేషన్ ఇందుకు దోహదపడిందని నిర్ధారించారు.
అందుకే తరుచూ ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మానసికంగా మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
వయసు పెరిగే కొద్దీ మనుషులు కుంచించుకుపోతారా?
భారతదేశపు మొట్టమొదటి కారు ఏదో తెలుసా?
చలికాలంలో ఇవే పాటిస్తే చాలు.. బాలింతల ఆరోగ్యం పదిలం..