రోజుకు ఒక స్పూన్ నువ్వులు: మీ శరీరంలో జరిగే అద్భుతం!
27-06-2026
Pic credit - Instagram
Phani Ch
రోజూ కేవలం ఒకే ఒక్క స్పూన్ నువ్వులు తింటే మీ శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? చిన్నగా కనిపించే ఈ గింజల్లో కొండంత ఆరోగ్యం దాగుంది.
నువ్వులలో మన శరీరానికి ఎంతో మేలు చేసే మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
అధిక బరువుతో బాధపడేవారికి నువ్వులు ఒక మంచి ఔషధం. రోజూ తినే చిరుతిళ్లలో లేదా స్నాక్స్‌లో కొద్దిగా నువ్వులను చేర్చుకుంటే, ఇది మీ ఆకలిని నియంత్రించి చాలా సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నువ్వులలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి ఎన్నో రకాల అవసరమైన ఖనిజాలు దాగున్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
ఈ గింజల్లో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అలాగే ఇందులోని మెగ్నీషియం రక్తప్రసరణను మెరుగుపరిచి, మధుమేహం మరియు బీపీ వంటి సమస్యలను నివారిస్తుంది.
ఎముకల బలహీనతతో బాధపడేవారికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మరియు నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి.
ఉదయాన్నే ఒక టీస్పూన్ నువ్వుల నూనెతో నోటిని పుక్కిలించడం వల్ల నోట్లోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది ఆస్తమా రోగుల్లో శ్లేష్మాన్ని తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
నువ్వుల నూనెతో శరీరానికి మర్దనా చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అయితే, నువ్వులను అతిగా తింటే గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. అందుకే రోజుకు గరిష్టంగా 15 గ్రాములు మాత్రమే తినడం మంచిది.