ఉదయన్నే ఎండలో ఉంటె ఎన్ని లాభాలో తెలుసా.?

TV9 Telugu

21 November 2024

వాకింగ్‌ చేసే వారు ఐదు రూల్స్‌ మాత్రం తప్పకుండా పాటించాలి. కొన్ని పొరపాట్లు చేయడం వల్ల చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పార్క్ లు, ఇంటి బయట తోట, పచ్చని వాతావరణం, సహజ కాంతి ఉండే ప్రదేశాలను వాకింగ్‌ చేయడానికి ఎంపిక చేసుకోవాలి.

నడవడానికి సౌకర్యవంతమైన దుస్తులు, అరికాళ్లు వంగడానికి సులభంగా ఉండే లైట్‌ వెయిట్‌ షూస్ ధరించాలని నిపుణులు అంటున్నారు.

వాకింగ్‌ చేస్తూ నీళ్లు తాగితే శరీరంలో నీరు, లవణాల బ్యాలెన్స్ తప్పుతుంది. నడకకు 15 నిమిషాల ముందే నీరు తాగాలి.

నడిచిన తరువాత శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం వల్ల కండరాల నొప్పులు, ఎముకల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు.

సరైన భంగిమలో నడవకపోతే మోకాళ్లు, చీలమండల నొప్పులు వస్తాయి. వెన్ను నిటారుగా, గడ్డంపైకి లేపి స్ట్రైట్ గా నడవాలి. భుజాలు వంచి ఎప్పుడూ వాకింగ్‌ చేయకూడదు.

ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులలో గాలి ప్రవాహం మందగించి, వాకింగ్ చేసేటప్పుడు తొందరగా అలసిపోయేలా చేస్తుంది.

వాకింగ్ చేసేటప్పుడు చిన్నచిన్న అంగలు వేస్తూ వేగంగా నడవాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు నడక విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి.