వీటిని తింటే ఇనుప చువ్వల్లాంటి ఎముకలు మీ సొంతం..!
samatha
01 february 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ కొంత మంది హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ మనం తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంద
ి ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు.
చిన్న వయసులోనే కీళ్ల సమస్యలు, వెన్ను నొప్పి, నడుము నొప్పి, ఎముకల బలహీనత వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అయితే మన ఎముకలు బలంగా, దృఢంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఈ ఆహార చిట్కాలు పాటించాలి అంటున్నారు వైద్యులు. అవి ఏవి అంటే?
తప్పకుండా వీక్‌లో రెండు సార్లు క్యారెట్, పాలకూర జ్యూస్ తీసుకోవాలి. ఇందులో యాంటీఆక్సిడె
ంట్స్ పుష్కలంగా ఉంటాయి.
కిడ్నీ బీన్స్, శనగప్పు, కందిపప్పు, పెసరపప్పును తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాలి. దీని వలన 200 నుంచి 250 మిల్
లీగ్రాముల కాల్షియం పొందవచ్చు.
అలాగే ఎముకలు దృఢంగా ఉండటానికి తప్పని సరిగా ఆకుకూరలు మీ ఆహారంలో చేర్చుకోవాలి. దీని వలన కాల్షియం పెరిగి ఎముకలు బలంగా ఉంటాయి.
ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా మీ ఆహారంలో రాగి జావ, రాగిపిండితో చేసిన ఇడ్లీ, దోశలను తీసుకోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కైలాస మాన సరోవర్ యాత్ర పున:ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే?
ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా.. సిపుల్ టిప్స్ మీకోసమే!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!