బూడిద గుమ్మడికాయతో అనేక లాభాలు.. ఏంటో తెలుసా.?

TV9 Telugu

13 March 2025

బూడిద గుమ్మడికాయ.. ఎన్నో రకాల పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. దీనిని వింటర్ మిలన్ అని కూడా పిలుస్తారు.

ఇళ్ల ముందు దిష్టి కోసం ఉపయోగించే ఈ పండు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బూడిద గుమ్మడి కాయను వడియాలు, స్వీట్‌ తయారు కోసం ఉపయోగిస్తారు. దీనిని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే పలు సమస్యలు దూరమవుతాయి.

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను పరగడుపున తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఈ గుమ్మడికాయను ప్రస్తుతం పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు, చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

ఖాళీ కడుపుతో ఉదయం వేళ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిచ్చి.. దీర్ఘకాలిక వ్యాధులకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.

బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, బీకాంప్లెక్స్‌లు ఉంటాయి.

బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్.. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది.

అయితే, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని తీసుకునేముందు వైద్య నిపుణులను సంప్రదించడం మేలు..