రోడ్లపై కనిపిస్తే పనికిరాని మొక్క అనుకున్నారా.. ఈ పూలు చేసే మ్యాజిక్ తెలిస్తే అస్సలే వదలిపెట్టరు
samatha
22 February 2025
Credit: Instagram
సదాబహార్ పూలను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఇవి చూడటానికి చాలా బాగుంటాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ మొక్కలు ఎక్కువ కనిపిస్తాయి.
గులాబీ, తెలుపు రంగులో ఉండే వీటిని చాలా మంది పనికిరాని పిచ్చి పూలు అని అనుకుంటుంటారు. కానీ వీటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.
సదాబహార్ మొక్క చాలా శక్తి వంతమైన ఔషధ మొక్క నంట. దీనిని వైద్య కోసం ఎక్కువగా ఉపయోగిస్తారంట. వీటి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ పూలు చాలా ఉపయోగకరంగా ఉంటాయంట
వీటిని కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు మర్దన చేయడం వలన కురులు స్ట్రాంగ్ గా తయారువుతాయంట. ఈ మొక్క క్యాన్సర్ కణాలను కూడా అడ్డుకుంటుందట.
అలాగే రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడానికి ఈ పువ్వులు, ఆకులు చాలా బాగా ఉపయోగపడుతాయంటున్నారు నిపుణులు
అంతేకాదు లుకేమియా మలేరియా, గొంతు నొప్పి, స్కిన్ ఇన్‌ఫెక్షన్ వంటి పరిస్థితులను మెరుగుపరచడానికి ఇది మంచి మెడిసిన్.
బీపీ ఉన్నవారికి సైతం దీని ఆకులు నేచురల్ మెడిసిన్‌లా పనిచేస్తాయంట. రోజూ ఉదయ, సాయంత్రం 2 నుంచి 3 ఈ ఆకులను నమలడం వల్ల షుగర్, బీపీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.