సూర్యరశ్మిలో ఉన్నా.. సూర్య నమస్కారాలు చేసినా.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. శీతా కాలంలో ఎండలో కచ్చితంగా ఉండాలి.
సూర్యోదయం తర్వాత రెండు గంటలు.. సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు అనువైన సమయమని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు కనీసం అర గంట సమయం అయినా సూర్య రశ్మిలో శరీరంపై పడేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సూర్యరశ్మితో లభించే విటమిన్ డి వల్ల ఎముకలు, దంతాలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. వెన్నముక, కాళ్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఎండలో కూర్చోవడం వల్ల ఒత్తిడిని తగ్గించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రోగ నిరోధక శక్తిని, ఎనర్జీ లెవల్స్ పెరడం వల్ల వ్యాధుతో పోరాడే శక్తి లభిస్తుంది.
ప్రతిరోజూ కాసేపు సూర్య రశ్మిలో ఉండటం వల్ల నిద్ర లేమి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజూ సూర్య రశ్మిలో ఉండటం వల్ల రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి.
శీతా కాలంలో సూర్య రశ్మిలో ఉండటం వల్ల బాడీలో హీట్ పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది.