డయాబెటిస్ సమస్య ఉందా.? ఈ పండ్ల జోలికి వెళ్లొద్దు..
11 June 2025
Prudvi Battula
మామిడి పండ్లు: సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు మామిడిని దూరం పెట్టడం మంచిది.
అరటిపండ్లు: ముఖ్యంగా పండినప్పుడు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదం.
ద్రాక్ష పండ్లు: వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల సమస్య పెరుగుతుంది.
అంజీర్ పండ్లు: వీటిలో షుగర్ లెవెల్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీని కారణం అంజీర్ పండుని దియాబెటిక్స్ తినకూడదు.
ఖర్జూరాలు: చాలా తీపిగా ఉంటాయి. చక్కెర అధికంగా ఉంటుంది. ఖర్జూరాలు తినడం వల్ల డయాబెటిస్ సమస్య పెరుగుతుంది.
ఎండుద్రాక్ష: అధిక గ్లైసెమిక్ లోడ్ కలిగిన ఎండిన ద్రాక్ష దియాబెటిక్స్ తింటే షుగర్ లెవెల్స్ పెరిగి ప్రమాదంలో పడతారు.
నారింజ: విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, కానీ సహజ చక్కెరల కారణంగా దియాబెటిక్స్ వీటిని పరిమితిలో తినడం మంచిది.
అలాగే మధుమేహం ఉన్నవారు యాపిల్, జామపండు, బొప్పాయి, బెర్రీలు లాంటి పండు తినవచ్చు కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
శాతవాహన రీజియన్ టూర్.. తెలంగాణ టూరిజం నయా ప్యాకేజీ..
ఐస్క్రీమ్తో అనేక ప్రయోజనాలు.. తెలిస్తే షాక్..
సండే టూర్ ఉందా.? ఈ శైవక్షేత్రం మంచి ఎంపిక..