ఈ ఆహార పదార్ధాలు తినండి.. గుండె పోటు సమస్యకు చెక్ పెట్టేయండి

Phani CH

13 May 2025

Credit: Instagram

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్‌ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు అనే తారతమ్యాలు లేకుండ అకస్మాత్తుగా వచ్చే హార్ట్‌ ఎటాక్, కార్డియక్‌ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు.

గుండెపోటు నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రక్తనాళాలను శుభ్రంగా ఉంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

పాలకూర, కాలే, మెంతి కూర వంటి వాటిల్లో విటమిన్ K, యాంటీఆక్సిడెంట్లు, మరియు ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి, రక్తనాళాలను బలోపేతం చేస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ట్రైగ్లిసరైడ్స్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒమేగా-3 చేపల్లో ఎక్కువగా ఉంటుంది.. వీటిని వారానికి 2-3 సార్లు తినడం వల్ల గుండె పోటు సమస్యను తగ్గించవచ్చు.

బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ లో రోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు మెగ్నీషియం కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడం లో ఎంతగానో సహాయపడతాయి.

పప్పు ధాన్యాలు అయిన పెసర, శనగ, మినపప్పు, రాజ్మా వంటి వాటిలో ఫైబర్, ప్రోటీన్, మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి.. ఇవి రక్తపోటును నియంత్రిచడంలో సహాయపడతాయి.

వెల్లుల్లి, ఉల్లిపాయల్లో ఉండే అల్లిసిన్ రక్తనాళాలను సాఫీగా ఉంచుతుంది మరియు రక్తపోటును తగ్గిస్తుంది. 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ ఫ్లేవనాయిడ్స్‌తో రక్తనాళాలను బలోపేతం చేస్తుంది.