రోజుకు ఒకే ఒక్క గుడ్డు తినండి.. అదిరిపోయే లాభాలు మీ సొంతం

Phani CH

13 May 2025

Credit: Instagram

ప్రతి రోజు ఒక గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకంటే గుడ్లు పోషకాలతో నిండిన సూపర్‌ఫుడ్‌. ఒక గుడ్డులో సుమారు 6-7 గ్రాముల అధిక నాణ్యత ప్రోటీన్ ఉంటుంది

గుడ్లలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే గుణం ఉంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

అంతే కాకుండ గుడ్లలో లుటీన్ మరియు జీయాక్సాన్థిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.

గుడ్లలో కోలిన్ అనే పోషకం సమృద్ధిగా ఉంటుంది, ఇది మెదడు లోని కణాల నిర్మాణం మరియు నరాల సంకేతాలకు అవసరం.

గుడ్లలో విటమిన్ D, ఫాస్ఫరస్, మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి అవసరం.

గుడ్లలో విటమిన్ A, విటమిన్ B12, మరియు సెలీనియం ఉంటాయి, ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

గుడ్లలోని బయోటిన్, విటమిన్ E, మరియు ప్రోటీన్ చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా  దీనిలో ఉండే ఐరన్, B12 రక్తహీనత నివారణకు సహాయపడతాయి.

గుడ్డు తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది మరియు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. గుడ్లలోని B2 మరియు B12 శరీరంలో శక్తి ఉత్పత్తికి సహాయపడతాయి.