పిల్లలు పుట్టాలంటే మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలంటే ??

Phani CH

13 May 2025

Credit: Instagram

ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి అనేక కారణాలతో  సంతాన లేమి సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు.

అయితే ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి.

ఇకపోతే, సంతానం కలగాలంటే సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో సుమారు 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి.

ఇక ఈ విషయంలో వీర్యకణాల సంఖ్య 10 మిలియన్ నుంచి 20 మిలియన్ వరకు ఉంటే, దాన్ని ‘లో-స్పెర్మ్ కౌంట్’ అంటారు.

అయితే, గర్భధారణ కోసం కనీసం సుమారుగా 30 మిలియన్ కంటే ఎక్కువ స్పెర్మ్ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఈ ఇబ్బందులను ఎదుర్కొనే మగవారు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యంగా అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి.

వ్యాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. విటమిన్ D, C, E లను సమృద్ధిగా తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కదలిక, నాణ్యత మెరుగవుతుంది.