సీటీస్కాన్‌తో ఆ సమస్యలు వస్తున్నాయా.?
TV9 Telugu
21 November 2024
చిన్నారులకు సీటీస్కాన్‌తో యమ డేంజర్.. యువతలో బ్లడ్ కేన్సర్ ముప్పు...యూరోపియన్ పీడియాట్రిక్ సీటీ అధ్యయనంలో వెల్లడి.
అనారోగ్యం బారినపడి ఆసుపత్రికి వెళ్తే వైద్యులు వెంటనే సీటీస్కాన్ రాయడం పరిపాటిగా మారింది. రోగం ఏదైనా ముందు సీటీ స్కాన్ చేయించమంటారు.
ఈ స్కాన్ ద్వారా రోగానికి కారణమయ్యే అసలు విషయాన్ని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చనేది వైద్యుల భావన.
సీటీస్కాన్ అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే, తాజాగా ఈ సిటీస్కాన్‌కు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
సీటీ స్కాన్ వల్ల చిన్నారులు, యువత బ్లడ్ కేన్సర్ బారినపడే అవకాశం ఉందని యూరోపియన్ పీడియాట్రిక్ సీటీ అధ్యయనం హెచ్చరించింది.
దాదాపు 10 లక్షల మందిని అధ్యయనం చేసిన అనంతరం స్పష్టమైన ఇమేజీల కోసం సీటీ స్కాన్‌లో ఉపయోగించే ఎక్స్ కిరణాలు యువతను ముప్పులోకి నెట్టేస్తున్నాయంది.
బార్సెలోనాలోని పోంప్యూ ఫాబ్రా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసింది.
సీటీ స్కాన్ రేడియేషన్ కారణంగా రక్త కేన్సర్లు అయిన లింఫోయిడ్, మయోలిడ్ ముప్పు అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
లంగ్ క్యాన్సర్‌కి కారణాలు, లక్షణాలు ఇవే..
ఈ ఈజిప్ట్ నగరాలను క్రీస్తు పూర్వం ఏమని పిలిచేవారంటే.?
పానీపూరి లవర్స్ మీ కోసమే.. ప్రయోజనాలు తెలిస్తే వావ్ అంటారు..