ఏ దేశ ప్రజలు ఎక్కువగా అన్నం తింటారో తెలుసా? ఇండియా మాత్రం కాదు
22 November 2024
TV9 Telugu
TV9 Telugu
ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ఆహార అలవాట్లు ఉన్న దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో చపాతీ ప్రధాన ఆహారమైతే.. మరికొన్ని దేశాల్లో నూడిల్స్, బ్రెడ్, సూప్‌లు ప్రధాన ఆహారంగా ఉంటాయి
TV9 Telugu
ఇక మన దేశంలోనూ భిన్న ఆహారాలు తినే జనాలున్నారు. దేశం ఒకటే అయినప్పటికీ భిన్న ఆహార సంస్కృతులు ఆచరణలో ఉన్నాయి. దక్షిణాదినైతే వరి అన్నమే ప్రధాన ఆహారం. అనేక ప్రాంతాలలో రోజువారీ భోజనం అంటే అన్నమే. అన్నం భారతదేశంలో చాలా ఇష్టంగా తినే ఆహారం
TV9 Telugu
అయితే ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా బియ్యం అన్నం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందట. చైనా నుంచి బంగ్లాదేశ్ వరకు అన్నం ఇష్టంగా తినే దేశాలు చాలానే ఉన్నాయి
TV9 Telugu
వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2024 నివేదిక ప్రకారం పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియా ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యాన్ని వినియోగిస్తున్న దేశంగా గుర్తించింది. ఈ నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో గాంబియాలో ఒక్కొక్కరు 378.88 కిలోల బియ్యం వినియోగించారు
TV9 Telugu
చిగాంబియా తర్వాత, తూర్పు ఆఫ్రికా దేశం కొమోరోస్‌లో బియ్యం ఎక్కువగా వినియోగించే దేశంగా ఉంది. ఈ దేశంలో ఒక వ్యక్తి ఏడాది పొడవునా 295 కిలోల బియ్యం ఆహారంగా తీసుకుంటాడట
TV9 Telugu
దీని తర్వాత, ఏడాది పొడవునా మయన్మార్‌లో వినియోగిస్తున్న తలసరి బియ్యం 270.8 కిలోలు, బంగ్లాదేశ్‌లో 263 కిలోల తలసరి బియ్యం వినియోగిస్తారు
TV9 Telugu
నివేదిక ప్రకారం 2021 లో చైనాలో ఏడాది పొడవునా 128.99 కిలోల బియ్యం వినియోగిస్తున్నట్లు తేలింది. ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. ఇక్కడ ఒక్కో వ్యక్తికి ఏడాదికి 104.29 కిలోలు ఆహారంగా తీసుకుంటున్నాడని నివేదికలో పేర్కొన్నారు
TV9 Telugu
మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో భారతదేశంలో కంటే బియ్యం తక్కువగా వినియోగిస్తారు. పాకిస్థాన్‌లో ఒక వ్యక్తి ఏడాది పొడవునా 18.74 కిలోల బియ్యం మాత్రమే ఆహారంగా తింటున్నాడట