రోజుకో క్యారెట్ తింటే.. వారంలో మీ కళ్లను మీరే నమ్మలేరు!
01 December 2024
TV9 Telugu
TV9 Telugu
క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి. క్యారెట్ తింటే కంటిచూపు మెరుగుపడుతుందని తెలియని వారుండరు
TV9 Telugu
కెరొటిన్, పీచు, పొటాషియం, కాల్షియం కెలొరీలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, విటమిన్లతో ఇది మంచి పోషకాహారం. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి
TV9 Telugu
వీటిని తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తపోటును, గుండె జబ్బులను నిరోధిస్తాయి. జీర్ణ ప్రక్రియలో అపసవ్యతలుంటే తగ్గిపోతాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి
TV9 Telugu
క్యారెట్లు తినేవారిలో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఊబకాయం బారిన పడనివ్వవు. క్యారెట్ నమలడం నోటికి మంచి వ్యాయామం. వీటితో దంతాలు దృఢంగా ఉంటాయి
TV9 Telugu
అందుకే రోజూ ఒక్క క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రస్తుత రోజుల్లో చిన్నవయసులోనే చాలా మంది కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు
TV9 Telugu
క్యారెట్‌లో ఉండే విటమిన్ ఎ, లైకోపిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యారెట్‌లో ఫైబర్ కూడా ఉంటుంది. అందుకే వీటిని తిన్న తర్వాత చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది
TV9 Telugu
బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. అలాగే తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు క్యారెట్లు తింటే ఈ సమస్యను పరిష్కరించగలవు
TV9 Telugu
ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిల్లోని బీటా కెరోటిన్, లుటిన్, లైకోపీన్, అనేక ఇతర మూలకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పచ్చి క్యారెట్ తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు