వీరికి చపాతీలు విషంతో సమానం.. తింటే బాడీ షెడ్డుకే

27 September 2025

Ravi Kiran

బరువు తగ్గాలనుకునేవారు చపాతీలు ఎక్కువగా తింటుంటారు. రాత్రుళ్లు అన్నానికి బదులు వీటిని తీసుకుని వెయిట్ తగ్గించుకుందామని అనుకుంటారు. 

చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే, గోధుమలలోని గ్లూటెన్ పేగులలో మంటను కలిగిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది.

ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అన్నం మానేసి చపాతీ తింటారు.

అయితే గోధుమల్లో ఉండే గ్లూటెన్‌లోని కార్బోహైడ్రేట్లు శరీరంలో కొవ్వును నిల్వ చేయడానికి కారణమవుతాయి. ఇది సులభంగా బరువు పెరగడానికి దారితీస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు అన్నానికి బదులు చపాతీలు ఎక్కువగా తింటుంటారు. కానీ వారు చపాతీలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటారు.

అలసట సమస్య ఉన్నవారు చపాతీలు తినకపోవడం మంచిది. ఎందుకంటే గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం మరింత పెరుగుతాయి.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు చపాతీలు తినకూడదు. గోధుమలలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది.

పైన పేర్కొన్నవి కేవలం పలు వైద్య కథనాల మేరకు ఆధారితమైనవి. మీరు మీ డైట్ మార్చుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించండి.