ఉదయాన్నే ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగుతున్నారా.. ఈ వ్యాధులున్నవారు జాగ్రత్త

03 October 2025

Ravi Kiran

ఇంట్లో పెద్దలు పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు నేటికీ అంతే ప్రభావం చూపిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం ఈ ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. 

అయితే అందరికీ ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మరి అదేంటో చూసేద్దాం. 

కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీరు తాగడం వారి ఆరోగ్యానికి మంచిది కాదు.

నోటి లేదా దంత వ్యాధులు ఉన్నవారు ఖాళీ కడుపుతో నీరు తాగకూడదు. అలాంటి వారు ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే, నీటితో పాటు లాలాజలాన్ని మింగితే, హానికరమైన బ్యాక్టీరియా లాంటివి శరీరంలోకి ప్రవేశిస్తాయి.   

అటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నీరు తాగే ముందు నోటిని బాగా కడుక్కోవాలి. అప్పుడు నోటిలోని బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత, నీరు తాగవచ్చు. 

లాలాజలాన్ని ఉమ్మివేయడం కంటే మింగడం మంచిదని కొందరు భావిస్తారు. ఎందుకంటే లాలాజలంలోని ఎంజైమ్‌లు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయంటారు. 

అందువల్ల, అనవసరంగా లాలాజలాన్ని ఉమ్మివేయడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో సరిగ్గా నీరు తాగడం, నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.