అతిగా అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Samatha

19 august  2025

Credit: Instagram

అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి

అందుకే ఆరోగ్య నిపుణులు తప్పకుండా ప్రతి రోజు ఒక అరటిపండు తినాలని సూచిస్తారు. దీని వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

కానీ అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివని అతిగా తినకూడదంట. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.

అరటిపండులో అధిక పొటాషియం ఉండటం వలన వీటిని అతిగా తింటే రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి, క్రమరహిత గుండె స్పందన, వికారం, బలహీనత కలుగుతాయి.

అలాగే అరటి పండ్లలో ఉండే సహజ చక్కెర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తాయంట. అందుకే డయాబెటీస్ ఉన్న వారు వీటిని అతిగా తినకూడదు.

అలెర్జీ ఉన్న వారు కూడా అరటి పండ్లను అతిగా తినకూడదంట. దీని వలన ఓరల్ అలెర్జీ సిండ్రోమ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంట.

అరటి పండ్ల అతిగా తినడం వలన ఇవి మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. మగతగా అనిపించడం , అలసిపోయినట్లు అనిపిస్తుందంట.

అందుకే వీలైనంత వరకు అరటి పండ్లను అతిగా తినకూడదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో అస్సలే తినకూడదంట