దొండకాయ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

19 august  2025

Credit: Instagram

దొండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది దీనిని ఎక్కువగా తింటే మతిమరపు వస్తాదని తినడానికి అంతగా ఇష్టపడరు.

కానీ దొండకాయను ప్రతి రోజూ కాకుండా, కనీసం వారంలో ఒకటి లేదా రెండు సార్లు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దొండకాయలో తక్కువ నీరు అధిక ఫైబర్ ఉండటం వలన ఇది బరువును నియంత్రణలో ఉంచుతుందంట. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినడం చాలా ఉత్తమం.

దొండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా ఆకలిని తగ్గిస్తుంది.

దొండకాయలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఇది చర్మాన్ని కాపాడటమే కాకుండా మొటిమలను తగ్గిస్తుంది.

మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ దొండకాయ తినడం వలన ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.

మధుమేహ సమస్యలతో బాధపడే వారు కనీసం వారంలో రెండు సార్లైనా దొండకాయ తినడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందంట.

దొండకాయ బరువు తగ్గడం, జీర్ణక్రియకే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.