రోజుకు ఒక అరటి పండు తింటే ఎన్ని ప్రయోజనాలో..

Samatha

26 july  2025

Credit: Instagram

అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఆరోగ్య నిపుణులు తప్పనిసరిగా రోజుకు ఒక అరటి పండు తినాలని చెబుతుంటారు.

అయితే రోజుకు ఒక అరటి పండు తినడం వలన శరీరంలో ఏం జరుగుతుందో? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

అరటి పండులో పొటాషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

అలాగే అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ ఒకటి తినడం వలన ఇది జీర్ణశక్తిని పెంచి మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది.

అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన ఇది గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

వర్షాకాలంలో చాలా వైరల్ ఇన్ఫెక్ష్న్స్ దాడి చేస్తాయి. అందువలన రోజుకు ఒక అరటి పండు తినడ వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడే శక్తి లభిస్తుంది.

అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం , ఫైబర్ వంటివి ఎక్కువ మొతాదులో ఉంటాయి. అందువలన ఇవి ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి. 

అరటి పండులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త హీనత సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.