చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరటిపండు తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. దీనిని రోజూ తినడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయంట.
అరటి పండ్లలో కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్ బీ6, విమెన్ సి, మెగ్నీషీయం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన అరటి పండు ఆరోగ్యానికి చాలా మలు చేస్తుందంట.
దీనిని తినడం వలన శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా క్రమం తప్పకుండా తినేవారికి చాలా మేలు జరుగుతుందంట.
అరటి పండ్లు సహజ చక్కెర, ఫైబర్‌కు మూలం అందువలన దీనిని తినడం వలన శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా, ఇది అలసట, బలహీనతను కూడా తగ్గిస్తుందంట.
అందుకే ప్రతి ఒక్కర తప్పకుండా అరటి పండును మీ డైట్‌లో చేర్చుకోవాలంట. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు దీనిని అల్పాహారంలో తీసుకోవడం మంచిది.
దీనిని రోజూ తీసుకోవడం వలన జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. దీనిని ప్రతి రోజూ తినడం వలన గుండె సమస్యలు తగ్గుతాయంట.
అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.