ఎర్ర మూత్యాలు వీరికి విషంతో సమానం.. తిన్నారో నేరుగా కైలాసానికే!

03 April 2026

TV9 Telugu

TV9 Telugu

ఎర్ర ముత్యాల్లా తళతళలాడే దానిమ్మ గింజలు రుచికి తియ్యగా.. వగరుగా.. భలేగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు దండిగా ఉంటాయి

TV9 Telugu

దానిమ్మ పండును తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే దానిమ్మ అంద‌రికీ ఒకేవిధ‌మైన ప్రయోజ‌నాల‌ను అందించ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు

TV9 Telugu

ముఖ్యంగా కొంద‌రికి వీటిని తీసుకోవ‌డం వల్ జీర్ణ స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య స‌మ‌స్యల‌కు మందులు వాడేవారు దానిమ్మ గింజ‌లు తినకూడదట

TV9 Telugu

దానిమ్మ పండ్లల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ర‌క్తపోటును త‌గ్గించ‌డంలో ప్రభావ‌వంతంగా ప‌ని చేస్తాయి. రోజుకు 300 ఎమ్ఎల్ దానిమ్మర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల 2 నెల‌ల్లో దాదాపు 5 mmHg వ‌ర‌కు సిస్టొలిక్ ర‌క్తపోటు, దాదాపు 3 mmHg డ‌యాస్టొలిక్ ర‌క్తపోటు త‌గ్గుతుంద‌ట

TV9 Telugu

అయితే ఇప్పటికే హైపోటెన్షన్ తో బాధ‌ప‌డే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తపోటు మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంది. కొన్నిసార్లు దృష్టి లోపం, మూర్ఛ వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు

TV9 Telugu

దీంతో మందులు శ‌రీరంలో ఎక్కువ స‌మ‌యం ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఔష‌ధ స్థాయిలు పెరుగుతాయి. వీటి వ‌ల్ల క‌లిగే దుష్ప్రభావాలు ఎక్కువ‌వుతాయి. గుండె స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డే వారికి, దీర్ఘకాలిక మందులు తీసుకునే వారికి ఇవి ప్రమాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంది

TV9 Telugu

దానిమ్మపండ్లు ర‌క్తం గ‌డ్డక‌ట్టే విధానాన్ని ఆలస్యం చేస్తాయి. అందువల్ల ఆపరేషన్‌ జ‌ర‌గ‌డానికి ముందు కనీసం 2 వారాల పాటు దానిమ్మ పండ్లను తీసుకోకూడ‌దు. అంతేకాకుండా శ‌స్త్ర చికిత్స స‌మ‌యంలో ర‌క్తస్రావం ఎక్కువ‌గా అయ్యే అవ‌కాశం ఉంది

TV9 Telugu

దానిమ్మ పండ్లు తింటే కొందరికి అల‌ర్జీ వచ్చే అవ‌కాశం ఉంది. దుర‌ద‌, ముఖం వాపు రావ‌డం, ద‌ద్దుర్లు, తీవ్రమైన సంద‌ర్భాల్లో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌ల‌గ‌డం, అనాఫిలాక్సిన్ వంటి స‌మ‌స్యలు వ‌చ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి