సండే స్పెషల్.. పచ్చి మిర్చి కారంతో మటన్ కర్రీ.. ఎలా వండాలంటే?   

Samatha

11 April 2026

మటన్ కర్రీ అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా మటన్ కర్రీ వండుకొని మరి తింటారు.

మటన్

ఇక సండే వచ్చిందటే చాలు ప్రతి ఒకరి ఇంటిలో నాన్ వెజ్ వంటల గుమ గుమలు అదిరిపోతాయి. ప్రతి వాడలో చికెన్, మటన్‌తో సందడి నెలకుంటుంది.

సండే స్పెషల్

అయితే ఎప్పుడూ వండే విధంగా కాకుండా, కారం లేకుండా పచ్చి మిర్చి కారంతో మటన్ కర్రీ ఇలా వండితే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా, ఒకసారి మీరు ట్రై చేయండి.

పచ్చి మిర్చి కారం మటన్

కావాల్సిన పదార్థాలు : మటన్, పచ్చి మిర్చి, ఉప్పు, ఉల్లిపాయలు, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, పూదీన , కొత్తిమీర, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్.

కావాల్సిన పదార్థాలు

ముందుగా పచ్చిమిర్చీ తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, తొడిమలు కట్ చేసి, మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.

పచ్చి మిర్చీ, మటన్

ఇప్పుడు, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె పోసి, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు లవంగాలు, వేసి మంచిగా వేయించుకోవాలి.

స్టవ్ ఆన్

తర్వాత ఇందులోకి మటన్ వేసి బాగా వేగనివ్వాలి. మటన్ కాస్త ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి ఉల్లి పేస్ట్ వేయాలి. కొన్ని నీళ్లు పోసి ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి.

మటన్ ఉడకబెట్టడం

మటన్ ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, పూదీన, కొత్తిమీర వేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి కారం మటన్ రెడీ.

మటన్ కర్రీ రెడీ