కారం కారంగా, రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ మసాలా కర్రీ.. ఇలా సింపుల్‌గా చేసెయ్యండి!

14  September 2025

Samatha

సండే వస్తే చాలు చాలా మంది కారం కారంగా, రెస్టారెంట్ స్టైల్‌టో చికెన్ లేదా ఎగ్‌తో ఏదైనా మంచి వంటకం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు.

అయితే అలాంటి వారికోసమే ఈ అద్భుతమైన టేస్టీ ఎగ్ మసాలా కర్రీ, దీనిని ఇలా తయారు చేసుకుంటే కారం కారంగా చాలా బాగుంటుంది.

కావాల్సిన పదార్థాలు :  6 ఎగ్స్, 3 టేబుల్ స్పూన్ల నూనె, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 టమోటాలు, 6 కరివేపాకులు, 1 ఎర్ర మిరపకాయ.

4 పచ్చిమిర్చీ, 1 స్పూన్ జిలకర్ర, పసుపు చిటికెడు, కొత్తి మీర పొడి, కొద్దిగ గరం మసాలా, కిచెన్ కింగ్ మమసాల, 2 టేబుల్ స్పూన్ల తాజా క్రీమ్, ఉప్పు, కారం మిరియాలు.

ముందుగా ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పైన చెప్పిన వాటిలోని కూరగాయలు ఫ్రెష్‌గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.

తర్వాత పాన్ స్టవ్ మీద పెట్టి , ఆయిల్ వేసి మీడియం మంట మీద ఉడికించిన ఎగ్స్ వేయించుకోవాలి. కాస్త బంగారు రంగు వచ్చే వరకు. తర్వాత ఉల్లిపాయలను వేయించుకోవాలి.

ఆతర్వాత అదే పాన్‌లో కొంచెం నూనె వేసి, జీలకర్ర, కరివేపాకు, ఎర్ర మిరపకాయలు, వేసి చిన్న మంటపై వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటోలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 3 నిమిషాల వరకు వేయించాలి. తర్వాత మసాల వేసి నూనె వేరు అయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత అందులో సుగంధ ద్రవ్యాలు, గుడ్లు వేసి మళ్లీ వేయించుకోవాలి.

తర్వాత కొంచెం కారం వేయండి, నిమిషం తర్వాత పైన చెప్పిన మసాలాలు వేసి నిమిషంపాటు ఉంచాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. అంతే వేడి వేడి కారం కారం ఎగ్ మసాలా కర్రీ రెడీ.