పచ్చి మామిడికాయ జ్యూస్ ఎప్పుడైనా ట్రై చేశారా.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్దీ!

Samatha

10 April 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయల సీజన్ వచ్చేసినట్లే. వేసవిలో చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడి పండ్లు తింటుంటారు.

సమ్మర్

ఇక కొంత మంది పచ్చి మామిడికాయలను ఇష్టంగా తింటే మరి కొంత మంద పండ్లు ఎక్కువగా తింటారు. కొందరు ఎక్కువగా జ్యూస్ చేసుకొని తాగుతుంటారు.

పచ్చి మామిడి

అయితే ఎవ్వరైనా సరే పండిన మామిడి పండ్ల నుంచి గుజ్జు తీసి జ్యూస్ చేస్తారు. కానీ పచ్చి మామిడి కాయలతో కూడా ఇలా జ్యూస్ చేసి తాగితే టేస్ట్ అదిరిపోద్దంట.

పచ్చి మామిడి జ్యూస్

మామిడి కాయను చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత గుజ్జు తీసి దీనిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

మామిడి ముక్కలు

మంచి టేస్ట్ కోసం బెల్లం లేదా చక్కెర కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, జీలకర్ర పొడి వేయాలి.

బెల్లం లేదా చక్కెర

తర్వాత మరోసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి లేదా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.

మిక్సీ పట్టుకోవడం

ఎప్పుడూ పండిన మామిడి పండ్లతోనే కాకుండా, కాస్త వెరైటీగా పచ్చి మామిడి కాయలతో జ్యూస్ చేసుకొని తాగితే అదిరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

జ్యూస్

ఇది ఆరోగ్యానికి కూడ చాలా మంచిది. ముఖ్యంగా వారానికి రెండు లేదా మూడు సార్లు దీనిని చేసుకొని తాగడం వలన ఆరోగ్యం బాగుంటుందంట.

మ్యాంగో జ్యూస్