రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది.. కానీ వీరికి మాత్రం ప్రమాదకరం!

samatha

21 may 2026

రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఆరోగ్య నిపుణులు తప్పకుండా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకోవాలని చెబుతారు.

రాగులు

ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంటాయి.

పోషకాలు పుష్కలం

అయితే రాగులు డైట్‌లో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇవి కొందరి ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదట.

ఆరోగ్య ప్రయోజనాలు

కాగా, అసలు రాగులు ఎవరు తీసుకోకూడదు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు రాగులు తీసుకోవడం వలన ఇబ్బందులు పడుతారో చూద్దాం.

అనారోగ్య సమస్యలు

రాగులలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన కిడ్నీ సమస్యలతో బాధపడే వారు వీలైనంత వరకు రాగులను తీసుకోకపోవడమే మంచిది.

కిడ్నీ సమస్యలు

అదే విధంగా, జీర్ణ సమస్యలతో బాధపడే వారు కూడా రాగులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది, లేకపోతే ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

జీర్ణ సమస్యలు

థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు, ముఖ్యంగా హైపర్ థైరాయిడ్ ఉన్నవారు రాగులను తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

థైరాయిడ్ సమస్యలు

ఇవే కాకుండా బరువు తగ్గాలి అనుకునేవారు, అలెర్జీ సమస్యలు, చర్మంపై దద్దర్లు ఏర్పడే వారు, శ్వాస సమస్యలు ఉన్న వారు కూడా రాగులకు దూరం ఉండాలి.

బరువు నియంత్రణ