రోజూ ఉదయాన్నే గ్లాసుడు ఉసిరి రసం తాగితే..

29 November 2024

TV9 Telugu

TV9 Telugu

మామూలు రోజులతో పోలిస్తే ఈ చలికాలంలో మనకి రోగనిరోధకశక్తి చాలా అవసరం. ఇందుకోసం ఎన్నో ఆహారాలున్నా... ఉసిరి ప్రత్యేకం. ఎందుకంటే విటమిన్‌ సితోపాటు ఔషధ గుణాలు మెండుగా ఉండే ఫలమిది

TV9 Telugu

ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి. జబ్బులపై పోరాడే తెల్లరక్తకణాలని వృద్ధి చెందేట్టు చేస్తాయి

TV9 Telugu

చలికి చర్మం, జుట్టు మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా మారతాయి. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి

TV9 Telugu

ఉసిరి ఈ  కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని సలాడ్‌, జ్యూస్‌, మురబ్బాల రూపంలోనూ తీసుకోవచ్చు

TV9 Telugu

ముఖ్యంగా ఉసిరి రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉసిరికాయలో కాల్షియం, ఐరన్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే అనేక విటమిన్లు కూడా ఉంటాయి

TV9 Telugu

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఉసిరి రసంలో విటమిన్ బి1 ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిచ్చి మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరి రసంలో ఉండే విటమిన్ B2 చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది

TV9 Telugu

అంతేకాకుండా ఇది జుట్టును కూడా బలపరుస్తుంది. ఉసిరి జ్యూస్‌లో ఉండే విటమిన్ బి6 శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది