మెంతి ఆకులు ఆ సమస్యలు ఉన్నవారికి వరం.. తింటే ఎంతో మేలు!
16 october 2025
Samatha
మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడ వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచిదో తెలుసుకుందాం.
మెంతి ఆకులలో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది ఒత్తిడిని తగ్గించి, వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది.
డయాబెటీస్ ఉన్న వారికి ఇది వరం అని చెప్పాలి. ఎందుకంటే? మెంతిలో ఉండే కొన్ని సమ్మేళనాలు పేగు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఇన్సులిన్ మెరుగు పరిచి, చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
మెంతి కూరలో ఉండే ట్రైగ్లిరైడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తపోటు తగ్గించడంలో కూడా ఇవ కీలక పాత్ర పోషిస్తాయి.
కాలేయ పనితీరుకు మెంతికూర చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, కాలేయ కణాలలో ఉండే టాక్సిన్స్ బయటకు పంపించి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
మెంతి ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందువలన దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది దీర్ఘకాలిక మంట, గాయాలను తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి మద్దతిస్తుంది మెంతికూర. అందువలన ప్రతి రోజూ లేదా వారానికి ఒకసారి దీనిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెంతి ఆకుల్లో ఉండే బయో యాక్టివ్ పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచి, మీ శరీరాన్ని ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు.