చాలా మంది అధికంగా ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఎక్కువ ఫైర్ ఫుడ్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
అయితే ఫైబర్ ఫుడ్ మంచిది కదా అని అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, దీని వలన కలిగే సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం.
జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, మధుమేహ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.
ఇది బరువు తగ్గడానికి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ దీనిని అతిగా తినడం చాలా ప్రమాదకరం అంట, ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వలన కడుపు సమస్యలు ఎక్కువ వస్తాయి.
కడుపులో గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలను పెంచుతుందంట. అందుకే వీలైనంత వరకు ఫైబర్ ఫుడ్ అధికంగా తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వలన కడుపు ఉబ్బినట్లు అనిపించడం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఫైబర్ ఫుడ్‌లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇలా పీచు పదార్థం అతిగ తీసుకోవడం వలన ఇది కడుపు నొప్పికి కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందవంట. అందుకే వీలైనంత వరకు ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.