కొబ్బరికాయ లోపలికి నీళ్లు ఎలా వస్తాయి..? ప్రకృతి దాచిన వింత..
Krishna
06 July 206
కొబ్బరి నీళ్లు పోషకాల నిలయం. శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి చెట్టు మొదట తన బలమైన వెర్ల ద్వారా భూగర్భం నుండి నీటిని, దానికి అవసరమైన ఖనిజ లవణాలను గ్రహిస్తుంది.
వేర్ల ద్వారా ప్రయాణం
నేల నుండి గ్రహించిన ఈ నీరు, పోషకాలు.. చెట్టు కాండం లోపల ఉండే ప్రత్యేకమైన కణజాల గొట్టాల ద్వారా ప్రవహించి, కొమ్మల గుండ ఎదుగుతున్న కొబ్బరికాయలకు చేరుతుంది.
ప్రత్యేక గొట్టాల ద్వారా
ఈ నీరు ద్రవాభిసరణ అనే సహజ సిద్ధమైన వడపోత ప్రక్రియ ద్వారా కాయ లోపలికి ప్రవేశిస్తుంది. అందువల్లే కొబ్బరి నీరు ఎలాంటి కాలుష్యం లేకుండా అంత స్వచ్ఛంగా ఉంటుంది.
ద్రవాభిసరణ ప్రక్రియ
కొబ్బరికాయ చాలా చిన్నదిగా ఉన్న ప్రారంభ దశలో, కాయ లోపల ఒక పారదర్శక ద్రవ రూపంలో అంకురకణం ఏర్పడుతుంది. ఈ ద్రవమే మనం తాగే కొబ్బరి నీరు.
అంకురకణం
ఈ కొబ్బరి నీటిలో ప్రారంభంలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, శరీరానికి అవసరమైన సహజ ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు ఇందులో సమృద్ధిగా నిల్వ ఉంటాయి.
పోషకాల గని
కాయ క్రమంగా పెరిగి పండే కొద్దీ. లోపల ఉన్న కొబ్బరి నీరు క్రమంగా గడ్డకట్టి తెల్లటి గుజ్జుగా మారుతుంది. అందుకే లేత బోండాల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ముదిరిన కాయల్లో నీరు తక్కువగా ఉంటుంది, గుజ్జు ఎక్కువగానూ ఉంటుంది.
నీరు గుజ్జుగా మారే
చాలామంది కొబ్బరికాయలోకి వర్షపు నీరు వెళ్తుందని అపోహ పడతారు. కానీ దాని గుండ బయటి నీరు లోపలికి వెళ్లడం అసాధ్యం. ఇది కేవలం చెట్టు లోపల జరిగే జీవక్రియల వల్లే తయారవుతుంది.
బయటి నీరు
నేలలో మొదలైన నీటి ప్రయాణం చెట్టులోని ప్రతి భాగం గుండా ప్రవహించి, చివరకు కొబ్బరికాయ లోపల అమృతం లాంటి పోషక ద్రవంగా మారడం ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టి.