వేసవిలో విస్తారంగా దొరికే ద్రాక్షపండ్లు ఎండల నుంచి సేదతీరేందుకు ఎంతో ఉపకరిస్తాయి. శీతల పానీయాలకు బదులుగా గుప్పెడు ద్రాక్షపండ్లు తిన్నా లేదా వాటితో జ్యూస్ చేసి తాగినా తక్షణ శక్షి లభిస్తుంది
TV9 Telugu
ద్రాక్షపండ్లు తినటం వల్ల శరీరానికి కాపర్, ఐరన్, మాంగనీస్, రిబోఫ్లేవిన్, పొటాషియం, థియామిన్, మెగ్నీషియం, ఎ, సి, కె విటమిన్లు అందుతాయి. వెంటనే శక్తి కలుగుతుంది. నీరసం, నిస్సత్తువ మాయమవుతాయి
TV9 Telugu
అరుగుదల బాగుంటుంది. సమయానికి ఆకలి వేస్తుంది. ఇవి కండరాలను దృఢంగా ఉంచుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగవుతుంది
TV9 Telugu
అయితే మార్కెట్లో నల్ల, ఆకుపచ్చ ద్రాక్ష రెండు కనిపిస్తాయి. వీటిల్లో ఏది తీసుకోవాలో..? ఏవి ఆరోగ్యానికి మేలు చేస్తాయో? అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంటుంది
TV9 Telugu
నిజానికి.. ఏ ద్రాక్ష అయినా అందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి
TV9 Telugu
నల్ల, పచ్చ ద్రాక్ష రెండూ రుచికరమైనవే. కానీ చాలా మంది పచ్చ ద్రాక్షను ఇష్టపడతారు. అయితే పచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్షలో విటమిన్ సి చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
అమెరికా వ్యవసాయ శాఖ వారి సమాచారం ప్రకారం 100 గ్రాముల పచ్చ ద్రాక్షలో 4 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. వీటిలో విటమిన్లు ఎ, ఇ, కె కూడా తక్కువ మోతాదులో ఉంటాయి
TV9 Telugu
అదే 100 గ్రాముల గింజలు లేని నల్ల ద్రాక్షలో 10.9 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది పచ్చ ద్రాక్ష కంటే చాలా ఎక్కువ. నల్ల ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ ఎ, స్వల్ప మోతాదులో కాల్షియం వంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి