సేమియా పాయసం.. ఇంట్లోనే తియ్యగా ఎలా చేయాలో తెలుసా?

samatha

02 september 2026

Pic credit - Pinterest

సేమియా పాయసం ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా సేమియా పాయసం చేసుకుంటారు.

అయితే ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఇంటిలోనే చాలా సులభంగా సేమియా పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. కప్పు సేమియా, రెండు కప్పుల పాలు, అర కప్పు చక్కెర, నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి, వేడి చేయాలి. తర్వాత సేమియా వేయాలి.

సేమియా పచ్చి వాసనపోయి, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసి మరో బౌట్ పెట్టాలి.

అందులో పాలు, చక్కెర, కొన్ని నీళ్లు పోసి మంచిగా మరగ బెట్టుకోవాలి. పాలు పొంగు వచ్చి, మంచిగా కాగేలా చూసుకోవాలి.

పాలు బాగా మరుగుతున్న సమయంలో అందులో సేమియా వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత మంచిగా కలుపుతూ దానిని ఉడికించుకోవాలి.

అది బాగా ఉడికి స్వీట్ స్మెల్ వస్తున్న సమయంలో, నెయ్యిలో వేయించిన బాదం, జీడిపప్పు, యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ పాయసం రెడీ.