కాఫీ ఎవరు తాగకూడదో తెలుసా? వీరు తాగితే ప్రమాదం!

Samatha

24 August  2025

Credit: Instagram

కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా కప్పు కాఫీ తాగుతుంటారు.

అయితే కాఫీ తాగడం మంచిదే అయినప్పటికీ కొంత మంది మాత్రం అస్సలే కాఫీ తాగకూడదంట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

గుండె సమస్యలు ఉన్న వారు కాఫీ తాగకూడదంట. ఎందుకంటే ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటను పెంచుతుంది.

యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడే వారు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ కాఫీ తాగకూడదంట. ఇది సమస్యను తీవ్రతరం చేస్తుందంట.

అదే విధంగా ఖాళీ కడుపుతో ఎప్పుడూ టీ తాగకూడదంట. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గర్భిణీలు కూడా అతిగా కాఫీ తాగకూడదంట. దీని వలన అధిక బరువుతో బిడ్డ పుట్టడం, గర్భస్రావం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

పిల్లలు, టీనేజర్స్ కాఫీని అతిగా తీసుకోకూడదంట. దీని వలన నిద్ర లేమి, ఆందోళన, గుండె స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

ఆందోళన, నిద్రలేమి, మానసిక సమస్యలతో సతమతం అయ్యేవారు ఎట్టిపరిస్థితుల్లో కాఫీ తాగకూడదంట. ఇది సమస్యను పెంచుతుందంట.